భగవంతునిపై వైసీపీ పగబట్టింది : డిప్యూటీ సీఎం పవన్

posted on: Feb 5, 2026 1:43PM

 

 

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సాధారణంగా  వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి. కానీ వైసీపీ వాళ్లు భగవంతుడిపైనా పగపెట్టుకున్నారన్నారు. లడ్డూ నెయ్యిలో బీఫ్, పంది కొవ్వు, ఫిష్ అయిల్ ఉందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందని దాన్ని సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని డిప్యూటీ సీఎం తెలిపారు. మతాల మధ్య జరుగుతున్న వివాదాలు చాలా సున్నితమైనవి..అలాంటి వివాదాలు వైసీపీ సృష్టించిందని ఆయన అన్నారు. దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసి హేళన గా మాట్లాడారు...

ఒక రాజకీయ పార్టీ గా మతాల గురించి మాట్లాడకూడదని డిప్యూటీ సీఎం తెలిపారు. కానీ ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా, తిరుమల లడ్డు కల్తీ  వ్యవహారం గురించి ప్రజలకు నిజాలు వివరించాలని పవన్ తెలిపారు. జగన్ కుటుంబం ,భగవంతుడి మీద పగ పట్టారు... ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్నారు...ఏడు కొండల స్వామిని అపహాస్యం చేశారుని పవన్ తెలిపారు. 

అయోధ్య రామ మందిర వేడుక కు పంపిన లక్షల లడ్డూలకు  పవిత్ర లేదని కల్తీ నకిలీ నెయ్యి తో ఈ లడ్డు లు చేసారని ఆయన తెలిపారు. కల్తీ నకిలీ నెయ్యి తో ఈ లడ్డులు చేసారు...తిరుమల లడ్డు కు పాల ఉత్పత్తి జరగలేదు ,కెమికల్ తో తయారు చేసి ఉండొచ్చు అని సీబీఐ అధికారులు చెప్తున్నారు...వైసీపీ నాయకులకు హిందూ మతం  మీద గౌరవం లేదని ఆరోపించారు. బజార్లో నెయ్యి రూ. కిలో 500 అమ్ముతుంటే వీళ్ళు మూడొందలకీ  ఎలా సప్లయ్ చేశారని ప్రశ్నించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...