ముందు నెయ్యి- వెనక గొయ్యిగా జగన్ వ్యవహారం!
posted on: Jan 29, 2026 8:24PM
.webp)
పిడుగురాళ్లలో తిరుమల లడ్డూ వ్యవహారంలో పోస్టర్ల కలకలం ఒకటి చెలరేగింది. మహా పాపం నిజం.. అంటూ ఒక పోస్టర్ వెలిసింది. ఇందులో వైసీపీ పెద్దల హస్తం ఉంది. రూ.251 కోట్ల స్కామ్ కూడా జరిగిందంటూ.. ఈ పోస్టర్లో రాసి ఉంది. దీంతో ఈ ఫ్లెక్సీ కలకలం కారణంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భగ్గు మంది.ఇక టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అయితే, జంతు కొవ్వు కలపలేదంటూ సిట్ నివేదిక పేర్కొందని వైసీపీ అంటున్న మాటలో నిజం లేదన్నారు. లడ్డూలో కలిపిన కల్తీ నెయ్యి విషయంలో సిట్ ఆధారాలతో సహా ఇచ్చిందని. ఆ చార్జ్ షీట్ మొత్తం బయటకు వచ్చాక అసలు బండారం బయట పడుతుందని అన్నారు. అప్పుడు వైసీపీ వారు దేవుడి గుడి మెట్లు కాదు, వారి బాత్రూములు కడుక్కోవల్సి వస్తుందని అన్నారాయన.
ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అయితే ఒక కొత్త పాయింట్ లేవదీశారు. జంతు కొవ్వు పై పోరాటం ఈనాటిది కాదు. ఇది బ్రిటీషర్ల కాలం నాటి నుంచీ ఉందని అన్నారు. ఆనాడు మంగళ్ పాండే పందికొవ్వు కలగలసిన తూటాలను తాము వాడేది లేదని తెగేసి చెప్పడంతోనే స్వాతంత్ర ఉద్యమం మొదలైందని.. ఇప్పుడు శ్రీవారి లడ్డూలో కలిపిన జంతు కొవ్వు కూడా అలాంటి ఉద్యమానికే దారి తీసిందని. అందుకే తాము ఈ దేవాలయాల శుద్ది కార్యక్రమం చేపట్టామనీ అంటున్నారాయన. ఇదిలా ఉంటే ఇందులో జంతుకొవ్వు ప్రస్తావనే లేదు.
పామాయిల్ మాత్రమే ఉందన్న విషయం బయటపడ్డంతో.. ఇది మరో చర్చకు దారి తీసింది. మరి నెయ్యి స్థానంలో పామాయిల్ వంటి కెమికల్ కాక్ టైల్ కలపడమేంటి? ఇది కూడా నేరమే కదా? అన్నది కూటమి వారు, శ్రీవారి భక్తులు కలసి నిలదీస్తోన్న విధం కనిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు నెయ్యిలోనే కల్తీ జరిగిందనుకున్నాం.. అసలు నెయ్యే కాదంటే అదెంత మహాపరాధం??? అందుకేనా వైవీ సుబ్బారెడ్డి తన బ్యాంకు ఖాతాలను చూపించమంటే అది తమ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం అని కోర్టుకెక్కిందీ? అంటూ కొత్త లాజిక్ లాగుతున్నారు కొందరు.
ఈ నెయ్యి కాని నెయ్యి సరఫరా చేసిన వారి నుంచి వైవీ, ఆయన సతీమణి ఇరువురూ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఈ పాపం తామెక్కడ మూటగట్టుకోవల్సి వస్తుందో అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు సైతం బయటకు వచ్చేసినట్టుగా భావిస్తున్నారు. అంతే కాదు శ్రీవారి విషయంలో ఎవరైనా ద్రోహం చేస్తే వారికి ఎలాంటి శిక్ష పడుతుందో గతంలో వైయస్ వ్యవహారంలో అందరూ చూశామనీ.. ఇప్పుడు వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ధర్మారెడ్డి తాను తలకొరివి పెట్టించుకోవల్సింది. తానే తన కొడుక్కి తలకొరివి పెట్టారనీ.. ఇందంతా శ్రీవారికి చేసిన ద్రోహమే అసలు కారణంగా చెబుతున్న వారు లేక పోలేదు.
ఇక జగన్ కి 11 సీట్లతో స్వామివారు ఎంతటి శాస్తి చేశారో చూస్తూనే ఉన్నామని.. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వారంతా కలసి ఏ కోర్టులూ శిక్షించక పోయినా సరే అదంతా ప్రకృతే చూస్కుంటుందని అంటున్న ఇంకాస్త ఘాటైన శాపనార్ధాలు పెడుతున్నారు మరికొందరు. మొత్తం మీద శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంలో జంతుకొవ్వు అన్న పదం లేదంటూ ఊరట చెందిన వైసీపీకి.. ఇప్పుడది అసలు నెయ్యే కాదన్న వ్యవహారం వెలుగులోకి రావడంతో కొత్త కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ పార్టీ లీడర్లకు మరో సమస్య వచ్చి పడింది.
అదేంటంటే.. పామాయిల్ వ్యవహారం కల్తీ నెయ్యికన్నా మహా పాపం కావడంతో.. వ్యక్తిగతంగా ఎలాంటి కష్టాలు వస్తాయో అన్న ఆందోళన చెందుతున్నారు ఒక్కొక్కరూ. ఆగమ శాస్త్ర నియమానుసారం.. శ్రీవారి ప్రసాదాల్లో ఆవు పాలు విధిగా వాడమని రాసున్నారని అంటారు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి. అలాంటి నెయ్యి స్థానంలో పామాయిల్ వంటి కెమికల్ కలిపితే ఆ ఏడు కొండల వాడు అంత తేలిగ్గా వీరిని వదలి పెట్టరని అంటున్నారు భాను ప్రకాష్ రెడ్డి. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఆ వెంకన్నకే తెలియాలి.



.webp)


