పరకామణి చోరీపై అన్ని కోణాల్లో దర్యాప్తు : సీఐడీ డీజీ
posted on Nov 5, 2025 7:50PM

తిరుమల పరకామణి అవకతవకలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. డిసెంబర్ 2 వ లోపు దర్యాప్తు పూర్తి చేసి సంబంధించిన నివేదికను హైకోర్టులో సమర్పిస్తామని డీజీ రవిశంకర్ స్పష్టం చేశారు. నిందితుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నాడని తెల్సింది, ఆయనను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. భక్తులు, ఇతరుల వద్ద చోరీ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే 9440700921 నంబర్‌కు adgcid@ap.gov.in మెయిల్ ద్వారా మాకు తెలియజేయండని వారి వివరాలను గోప్యంగా ఉంచుతమని సీఐడీ చీఫ్ తెలిపారు.
5 టీములుగా ఈ పరకామణి కేసును దర్యాప్తు చేపడుతుమన్నారు. పరకామణి ఆఫీసర్స్, పరకామణిలో అధికారుల బాధ్యత, జీయర్ వ్యవస్థ బాధ్యత ఎంటి అనే అంశంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 1980 నుంచి రవికుమార్ జీయర్ మఠంలో గుమస్తాగా ఉన్నారు, అప్పటి నుంచి ఆయన వ్యవహారాలపై ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. ఆదాయం, ఆదాయానికి మించిన ఆస్తులు, బ్యాంకు ట్రాన్సక్షన్, సీసీ కెమెరాలు, ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతుందని రవిశంకర్ తెలిపారు.