తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కర్ణపత్రముల బహుకరణ

posted on: Jan 29, 2026 9:08PM

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు  కె. దీపక్ గురువారం ఉదయం విలువైన బహుమతిని సమర్పించారు. 178 గ్రాముల బరువుతో, బంగారంతో తయారు చేసి రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను అమ్మవారి సేవకు అంకితం చేశారు. సుమారు రూ. 23 లక్షల విలువైన ఈ కర్ణపత్రములను దాత టీటీడీ అధికారులకు అందజేశారు. 

అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న  దీపక్‌కు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు  బాబు స్వామి, సూపరింటెండెంట్  సురేష్, ఏవీఎస్వో  రాధాకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు  చలపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...