Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిలక్ వర్మ తీన్మార్ బ్యాటింగ్!
posted on: Apr 21, 2026 8:47AM
.webp)
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తీన్మార్ బ్యాటింగ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో లో తిలక్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.తన విధ్వంసకర బ్యాటింగ్ తో 18 ఏళ్ల రికార్డును సమం చేశాడు.
2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో ముంబై తరఫున సనత్ జయసూర్య 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున అదే ఫాస్టెస్ట్ సెంచరీ.. ఇప్పుడు తిలక్ వర్మ దానిని సమం చేశాడు. గుజరాత్ బౌలర్ కగిసో రబాడా ధాటికి పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు.
ఈ సీజన్ లో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మ.. ఈ మ్యాచ్ లో కూడా ఆరంభంలో తడబడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసిన తిలక్ వర్మ ఆ తరువాత గేర్ మార్చాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు.
33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ ఆ తరువాత 12 బంతుల్లోనే మిగిలిన 50 పరుగులు పూర్తి చేశాడంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది. తిలక్ వర్మ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత సెంచరీ తరువాత సామాజిక మాధ్యమంలో తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై ఇండియన్స్ మిడిలార్డర్‌లో ఒక కీలక ఆయుధంగా తిలక్ ను అభివర్ణిస్తున్నారు నెటిజనులు.






