విశాఖ సదస్సుకు పటిష్ఠ భద్రతా వలయం.. వంగలపూడి అనిత
posted on Nov 13, 2025 3:33PM

విశాఖలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు కోసం 3 వేల 500 మంది పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గురువారం (నంబర్ 13) ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె భద్రత విషయంలో ఇసుమంతైనా రాజీపడే పశక్తే లేదన్నారు.
భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యే వీఐపీలు, ఇన్వెస్టర్లు, ఇతర ప్రముఖులు విశాఖ విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేరే వరకూ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లోలో పేలుడు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తీవ్రదాదంతో పాటు రాజకీయ ఉగ్రవాదం పట్ల కూడా తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు. ఇక వైసీపీ సోషల్ మీడియాలో విశాఖ భాగస్వామ్య సదస్సుపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఉపేక్షించబోమని అనిత హెచ్చరించారు.