జనగామలో పెద్దపులి

posted on: Feb 6, 2026 11:30AM

జనగామ జిల్లాలు పెద్దపులి భయం వణికించేస్తోంది. జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని కుందారం గ్రామ శివారులో పెద్దపులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం సమాచారంతో స్థానికులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ పెద్ద పులి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అటవీ ప్రాంతాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామలోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెద్దపులి కుందారం, బాణాజీ పేట ప్రాంతాలలో సంచరిస్తోందని అధికారులు గుర్తించారు.  పులి సంచారం నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలను అప్రమ త్తం చేశారు.  రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పశువులను పొలాలలో కాకుండా ఇళ్ల వద్దనే కట్టేసి అప్రమత్తంగాఉండాలని సూచించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...