ఏపీ తెలంగాణలను వణికిస్తున్న పులి భయం

posted on: Feb 5, 2026 12:34PM

తెలుగు రాష్ట్రాలను పులి భయం వణికించేస్తున్నది. ఇంత కాలం చలిపులి గుప్పిట చిక్కి గజగజలాడిన తెలుగు రాష్ట్రాలు చలి ప్రభావం తగ్గిందనుకునే లోగానే నిజం పులి భయంతో గడగడలాడిపోతున్నారు. గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం ప్రాంత వాసులు పెద్దపులి భయంతో కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. 
ఇక తెలంగాణలో కూడా యాదాద్రిభువనగిరి, జనగామ జిల్లాలలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిందని భావిస్తున్న ఈ పెద్దపులి కొన్ని రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ ప్రాంతంలో కనిపించింది.

అదే పులి ఇప్పుడు , ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా జనగామ జిల్లాలను వణికిస్తోంది.  రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి ప్రాంతాల్లో  పులి సంచరిస్తున్నదని అధికారులు ధృవీకరించారు. మూటకొండూరు మండలంలో పులి అడుగుజాడలను గుర్తించారు.  అనంతారంలో ఒక లేగదూడ పులి చంపేసిందని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన యానిమల్ ట్రాకర్స్ పులి కదలికలను గమనిస్తున్నారు.  పులి ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు స్పష్టమైన సమాచారం వచ్చే వరకూ ప్రజలు జాగరూకతగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉందని అధికారులు భావిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...