బాబోయ్ బాబోయ్ పెద్దపులి.. వణుకుతున్న పోలవరం జిల్లా

posted on: Mar 4, 2026 8:07AM

పోలవరం జిల్లా పెద్దపులి భయంతో వణుకుతోంది. గంగవరం మండలం కుసుమరాయి గ్రామ పరిస రాల్లో పెద్దపులి సంచారం  స్థానికులను బెంబేలెత్తిస్తోంది.  పులి సంచారంతో  పూర్తిస్థాయిలో అప్రమ త్తమైన అటవీశాఖ పెద్దపులి జాడ కనుగొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.   అలాగే శ్రీశైలం నుంచి  నిపుణుల బృందాన్ని రప్పించింది.  

ఇలా ఉండగా పెద్దపులి సంచారంపై స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు.  రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లేవారు, ఒంటరిగా బయట తిరిగేవారు  జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.  పులి జాడను గుర్తించేందుకు  నిఘా కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పులిని బంధిస్తామన్నారు. అంత వరకూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...