Latest News

పోలవరం జిల్లాలోకి పెద్దపులి ఎంట్రీ!

posted on: Mar 20, 2026 8:28AM

పోలవరం జిల్లా జనాలు పెద్దపులి భయంతో వణికి పోతున్నారు. గత కొద్ది రోజులుగా కాకినాడ జిల్లాలో సంచరించిన పెద్దపులి ఇప్పుడు పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.  సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని బాపన్నదొర కొండల నుంచి పెద్దపులి, బవురువాక, తడువాయి అడవుల మీదుగా పోలవరం జిల్లా సరిహద్దులోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.  పెద్దపులి  సంచారాన్ని, కదలికలను  హనుమాన్ బృందాలతో అధికారులు  నిశితంగా గమనిస్తున్నారు. నాగులకొండ పర్వత శ్రేణిలో సుమారు 10 కిలోమీటర్ల మేర పులి పాదముద్రలను గుర్తించారు.

అయితే, పులి తాను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.  ముందుజాగ్రత్త చర్యగా ఉర్లకులపాడు, వెంకట్ నగర్, చెరువుకొమ్ముపాలెం, గొల్లవారి వీధి, కొత్తంపాలెం సహా 15కు పైగా గ్రామాలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. పులి జనావాసాల వైపు వస్తే పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...