Latest News

ఫరహాబాద్ వ్యూపాయింట్ వద్ద పెద్దపులి సంచారం

posted on: Mar 23, 2026 12:22PM

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవులలో పెద్ద పులి సంచారం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవులలో   ఆడపులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు.  ఫరహాబాద్ వ్యూ పాయింట్ పరిసరాల్లో పులి స్వేచ్ఛగా సంచరిస్తుండటం అభయారణ్యంలో పెద్దపులల సంఖ్య పెరుగుతోందనడానికి నిదర్శనమని అటవీ అధికారులు చెబుతున్నారు.

 ఇది సానుకూల పణామమని అటవీ అధికారులు భావిస్తున్నారు. అటవీ సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.  అటవీ ప్రాంతంలో పులి సంచారంపై ప్రజలను అప్రమత్తం చేశారు. పులి సంచారం కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్ల వద్దనీ ప్రజలకు సూచించారు. 

ఇలా ఉండగా ఈ ప్రాంతం అభయారణ్యంకిందకు వస్తుంది. ఇది శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉంది.  ఫరహాబాద్ ఫారెస్ట్ ప్రకృతి అందాలకు నిలయం. రంగురంగుల పక్షులు,  మయూరాలు, వివిధ రకాల జంతువులు ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఇది ఒక రకంగా పర్యాటక ప్రాంతం కూడా. ఈ అభయారణ్యంలో పెద్ద పులల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...