టోలిచౌకిలో భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి

posted on: Mar 5, 2026 4:47PM

 

హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ప్రాంతంలో నిర్మాణ పనుల సమయంలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకేసారి మూడు ఇండ్లలో విషాదఛా యలు అలుముకున్నాయి టోలిచౌకిలోని అల్లాస్నాథ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో గోవా కట్టెలు (సపోర్ట్ నిర్మాణం) ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు, అల్లాస్నాథ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న కొత్త ఐదు అంతస్తుల భవనానికి ప్లాస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం సుమారు పది మంది తాపీ మేస్త్రిలు గోవా కట్టెలపై నిలబడి పనిచేస్తు న్నారు. 

ఇదే సమయంలో భవనానికి సపోర్ట్‌గా ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కూలి పోవడంతో అక్కడ పనిచే స్తున్న కార్మికులు కిందపడి పోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భవన నిర్మాణంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలు లేకుండానే పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...