మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. మూడు రకాల మాదకద్రవ్యాల వినియోగం

posted on: Mar 18, 2026 2:18PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రోజు రోజుకో కొత్త కోణం బయటపడు తోంది. ఈ కేసులో పార్టీలో పాల్గొన్నవారు ఒకటి కాదు, రెండు కాదు.. మొత్తం మూడు రకాల డ్రగ్స్ విని యోగించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కొకైన్, ఎండిఎంఏ, మెడోహి టాపిన్  వంటి మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.  పోలీసుల విచారణలో  నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ కాగా..  పైలెట్ రోహిత్ రెడ్డి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. అలాగే అర్జున్ రెడ్డి సహా మిగిలిన వారు ఎండిఎంఏ,   మెడోహిటాపిన్ వినియోగించినట్లు తేలిందని చెబుతున్నారు. 

మరింత మత్తు కోసం ఖరీదైన మద్యం‌తో కలిపి వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు   పోలీసులు తమ విచారణలో గుర్తించినట్లు చెబుతున్నారు.  ముఖ్యంగా  రోహిత్ రెడ్డి, నమిత శర్మ మద్యం‌తో డ్రగ్స్ కలిపి వినియోగించి నట్లు పోలీసులు చెబుతున్నారు. మంచి కిక్ రావడం కోసం కాస్ట్లీ లిక్కర్‌తో కలిపి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.

ఈ కేసులో డ్రగ్స్ సరఫరాపై కూడా కీలక వివరాలు బయటపడ్డాయి. సిమ్లా నుంచి కౌశిక్ కొకైన్ తీసుకు వచ్చినట్లు సమాచారం. అలాగే అభిషేక్ నుంచి రెండు రకాల డ్రగ్స్‌ను పైలెట్  రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కొనుగోలు చేసినట్లు పోలీ సులు గుర్తించారు.   అదలా ఉంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో   అరెస్టయిన   నమిత్ శర్మ, పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలను  కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  కాల్పుల ఘటనలో నమిత్ శర్మను రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ప్రేరేపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏమి జరిగిన నేను చూసుకుంటా… కాల్చి పడేయాలి” అని రోహిత్ రెడ్డి ప్రోత్సహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముగ్గురు నిందితులను కస్టడిలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విష యాలు వెలుగు లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు ఈ ముగ్గురు నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...