మూడు చమురు నౌకలు సీజ్.. ఎక్కడంటే?

posted on: Feb 17, 2026 8:03AM

భారత్ మూడు చమురు నౌకలను సీజ్ చేసింది. ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ను ఉల్లంఘించి భారత జలాల్లోకి ప్రవేశించిన మూడు భారీ చమురు ట్యాంకర్లున్న నౌకలను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు సీజ్ చేశారు.  అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్‌తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ కోసం ముంబై నౌకాశ్రయానికి తరలించారు.

ఈ నౌకలను స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియాగా  గుర్తించారు.   భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి అంగీకరించిన వెంటనే, అమెరికా భారత వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించిన సంగతి విదితమే.  అయితే అయితే, ఈ మూడు చమురు ట్యాంకర్లతో తమకు  సంబంధం లేదని ఇరాన్‌కు చెందిన 'నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...