Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రష్యా, ఉక్రెయిన్.. మూడు రోజుల కాల్పుల విరమణ
posted on: May 9, 2026 9:16AM

రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అగ్రరాజ్యాధినేత డోనల్డ్ ట్రంప్ చొరవతోనే ఈ శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పవచ్చు. రష్యా, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శాంతి దిశగా కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శనివారం నుంచి మూడు రోజులు అంటే మే 11 వరకూ కాల్పుల విరమణ ఉంటుందని ప్రకటించిన ట్రంప్.. రష్యా విక్టరీ డే వేడుకలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరిందన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ పాత్ర కూడా కీలకమని పేర్కొన్న ఆయన ఈ కాల్పుల విరమణ కోసం తానే స్వయంగా ఇరు దేశాలనూ అభ్యర్థించినట్లు తెలిపారు. ఇందుకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు చెరొక వెయ్యి మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించాయన్నారు. గత రెండేళ్లుగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఈ భీకర యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం కావాలలని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.






