Latest News
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల దుర్మరణం
posted on: Jan 25, 2026 5:23PM

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన పలువురి హృదయాలను కదిలించి వేసింది.. నానమ్మ ఇంటికి వచ్చిన ముగ్గురు చిన్నా రులు ప్రమాదవశాత్తు పొలం వద్ద ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లో ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన స్నేహ (15), ముచ్చర్లపల్లికి చెందిన సిరి (14), శ్రీమన్యు (14) సెలవుల సందర్భంగా నానమ్మను చూసేందుకు గ్రామానికి వచ్చారు. గ్రామ పరిసరాల్లో పొలాల వద్ద ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసు కుంది. ఆ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న క్రమంలో అందులో ఒకరు ప్రమాదవశాత్తు పొలం పక్కన ఉన్న లోతైన నీటి కుంటలో పడిపోయారు. సహజమైన స్నేహబంధంతో ఆమెను కాపాడాలన్న ఆరాటంలో మిగిలిన ఇద్దరూ కుంటలోకి దిగారు. అయితే ఆ కుంటలో ఉన్న ఊబి, లోతు కారణంగా ముగ్గురూ బయటకు రావలేకపో యారు.
సహాయం కోసం కేకలు వేసే అవకాశం కూడా లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కొంతసేపటికి పిల్లలు కనబడకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా… నీటిపై తేలుతూ కనిపించిన చిన్నారుల మృతదేహాలు చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా విలపించారు. తమ కళ్ల ముందే భవిష్యత్తు అంతా చెదిరిపోవడంతో ఆ కుటుంబాల రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది.
భవిష్యత్తు కలలు కంటున్న తల్లిదండ్రులకు తీరని విషాదం పిల్లలు చదువుల్లో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవా లన్న తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా చిద్రమ య్యాయి.
సెలవులు పూర్తయ్యాక తిరిగి పట్నం వెళ్లి చదువులు కొనసాగించాల్సిన చిన్నారులు… ఇలా అనంత లోకాలకు వెళ్లిపో వడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు కావడంతో విషాద తీవ్రత మరింత పెరిగింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. పొలాల వద్ద ఉన్న నీటి కుంటలు, బోరుబావులు ప్రమాదాలకు కారణ మవుతున్న నేపథ్యంలో రైతులు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లలను కుంటలు, లోతైన ప్రాంతాల వద్దకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయా లని కోరారు. ఈ విషాద ఘటనతో ముచ్చర్లపల్లి గ్రామం మొత్తం శోకసంద్రం లో మునిగిపోయింది.






