Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోహ్లీతో వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యను రేప్ చేస్తామంటూ నెట్టింట బెదరింపులు!
posted on: May 25, 2026 9:57AM

మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే వాగ్వాదాలు, చోటు చేసుకునే ఆవేశకావేశాలు ఒక్కోసారి సోషల్ మీడియాలో తీవ్ర రూపం దాలుస్తుంటాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ వివాదం చల్లారకపోగా, కొంతమంది ఆకతాయిలు ట్రావిస్ హెడ్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతోంది. హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన కామెంట్లు, అత్యాచార బెదరింపులకు కొందరు నెటిజనులు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ఇరువురి మధ్యా ఆవేశాలు తగ్గలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. ఈ సంఘటనను పురస్కరించుకుని కొందరు నెటిజనులు.. వారు కోహ్లీ అభిమానులుగా అంతా భావిస్తున్నారు. ట్రావిస్ హెడ్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలతో పాటు అతడి భార్య జెస్సికా ఇన్‌స్టాగ్రామ్ పేజీని సైతం వదలకుండా దారుణమైన కామెంట్లతో దాడికి దిగారు.
ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోల కింద కొందరు వ్యక్తులు అత్యంత హేయమైన భాషను ఉపయోగించారు. మహిళ అని కూడా చూడకుండా ఆమె అత్యాచారం చేస్తామంటూ బెదరింపులకు దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. క్రీడా స్ఫూర్తికే మచ్చ తెచ్చేలా వారి తీరు ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌పై విజయం సాధించినప్పుడు లేదా భారత ఆటగాళ్లతో వివాదాలు ఉన్నప్పుడు వారి కుటుంబాలను టార్గెట్ చేయడం చూశాం. ఇప్పుడు మరోసారి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పేరిట కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ తరహా వికృత చేష్టలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఈ తరహా ఆన్‌లైన్ వేధింపులు కేవలం ఒక క్రీడాకారుడి కుటుంబ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, అంతర్జాతీయంగా భారత క్రీడాభిమానుల ప్రతిష్టను కూడా దిగజార్చేలా ఉన్నాయని క్రిడీ విశ్లేషకులు అంటున్నారు. మ్యాచ్‌లలో గెలుపోటములు, స్లెడ్జింగ్‌లు సర్వసాధారణమని.. వాటిని కేవలం మైదానానికే పరిమితం చేయాలని మెజారిటీ క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.


.webp)
.webp)


