ఆర్సీబీ.. కోహ్లీ డ్రీమ్ టీమ్ లో ఎవరెవరున్నారంటే?

posted on: Mar 17, 2026 2:18PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు సంబంధించి  తన ఆల్-టైమ్ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఐపీఎల్ ప్రారంభం నుండి నేటి వరకు జట్టులో భాగమైన ఆటగాళ్లలో అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేస్తూ కోహ్లీ  ఇది తన డ్రీమ్ టీమ్ అని పేర్కొన్నాడు.  

తన ఆల్-టైమ్ డ్రీమ్ టీమ్ లో  ఓపెనర్లుగా తనతో పాటు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గెయిల్‌ను  కోహ్లీ ఎంపిక చేశాడు. వీరిద్దరూ ఆర్‌సీబీ తరపున ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో గెయిల్ సృష్టించిన రికార్డులను దృష్టిలో ఉంచుకుని అతడిని తన ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా కోహ్లీ ఖరారు చేశాడు. ఇక మిడిలార్డర్ విషయానికి వస్తే.. తనకు అత్యంత సన్నిహిత మిత్రుడైన దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డీవిలియర్ ను ఎంపిక చేశారు.  అలాగే  కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, దినేష్ కార్తీక్‌లకు కూడా తన డ్రీమ్ టీమ్ లో చోటిచ్చారు. వికెట్ కీపింగ్ బాధ్యతలను దినేష్ కార్తీక్ , కేఎల్ రాహుల్ లలో ఎవరో ఒకరు నిర్వర్తిస్తారని పేర్కొన్నాడు. 

ఇక బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి  స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేతో పాటు యుజ్వేంద్ర చాహల్‌కు విరాట్  చోటిచ్చాడు. పేస్ విభాగంలో డేల్ స్టెయిన్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎంపిక చేసిన కోహ్లీ, భారత పేసర్ హర్షల్ పటేల్‌కు కూడా తన డ్రీమ్ టీమ్ లో అవకాశం ఇచ్చాడు. కోహ్లీ ఎంపిక చేసిన టీమ్ పూర్తి సమతూకంతో ఉందని క్రికెట్ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. 

ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు  తరపున మొదటి సీజన్ నుండి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2008లో అనామకుడిగా జట్టులోకి వచ్చిన కోహ్లీ, ఇప్పుడు  ఆ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఈ నేపథ్యంలో తన జట్టులో పాత, కొత్త తరం ఆటగాళ్లను కలగలిపి ఇదీ తన డ్రీమ్ టీమ్ అంటూ ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్‌సీబీ సన్నద్ధమవుతోంది. కొత్త ఆటగాళ్ల చేరికతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరి ఈ సీజన్‌లోనైనా విరాట్ కోహ్లీ ఆశించినట్టుగా బెంగళూరు జట్టు టైటిల్ నిలుపుకుంటుందా అన్నది చూడాలి.  అభిమానులు మాత్రం కోహ్లీ ఎంపిక చేసిన ఈ ఆల్-టైమ్ జట్టును సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కోహ్లీ డ్రీమ్ టీమ్ పై కొందరు మాజీ క్రికెటర్లు ఒకింత అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు. కోహ్లీ తన డ్రీమ్ టీమ్ లో కొందరిని విస్మరించాడని అభిప్రా యపడుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...