తగ్గిపోయిన జనం ... నిండిపోయిన ధనం!

posted on: Nov 22, 2016 10:00AM

 

నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాయి. ఏటీఎంలు ఎంత ఖాళీగా వుంటున్నాయో బ్యాంకుల్లోని గల్లా పెట్టెలు అంత నిండుగా అంటున్నాయి. అయితే, బ్యాంకుల్లోకి వస్తున్నవన్నీ పాత నోట్లే! కాని, బ్యాంకులు కాకుండా మరో చోట కూడా ఓల్డ్ నోట్స్ వర్షంలా కురుస్తున్నాయట! ఎక్కడంటారా? ఇంకెక్కడా తిరుమలలోని శ్రీవారి హుండీలో!


వెంకన్న ఆదాయం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాలా... అయితే, నోట్ల రద్దు నిర్ణయంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మరప్పుడు ఆటోమేటిక్ గా ఆదాయం కూడా తగ్గాలి కదా? కాని, పరిస్థితి రివర్స్ గా వుందట! తగ్గాల్సిన ఆపద మొక్కుల వాడి ఆదాయం పెరిగిపోతోంది. సోమవారం నాడు ఒక్క రోజే 4కోట్లు 18లక్షల రూపాయలు హుండీలో పడ్డాయట! ఇంత పెద్ద మొత్తం వసూలవటం గత ఆర్నెళ్లలో ఇదే మొదటిసారట! అంతేకాదు, నోట్లు బ్యానైన తరువాత గత పదకొండు రోజుల్లో స్వామి వారి ఆదాయం 34కోట్లు 3లక్షలు. అసలు నోట్లు రద్దై డబ్బులకు కటకటగా వున్న ఈ సమయంలో ఇంత భారీగా ఆదాయం రావటం ఆశ్చర్యమే కదా!


వెంకటేశ్వరుని ఆదాయం భారీగానే వుందిగాని దాంట్లో చాలా వరకూ పాత 500, 1000 నోట్లు వచ్చి వుంటాయని టీటీడీ అనుమానిస్తోంది. బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియని నల్ల భక్తులు ఇలా స్వామీ వారి ఖాతాలోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసేస్తున్నారు. దీని వల్ల ఎంతో కొంత పుణ్యంతో పాటూ పెద్ద నోట్లు ఏం చేయాలన్న పెద్ద టెన్షన్ కూడా వారికి తప్పుతుండవచ్చు!   
 

google-ad-img
    Related Sigment News
    • Loading...