పంజాగుట్టలో కిలో బంగారం చోరీ చేసిన దొంగ అరెస్టు

posted on: Feb 16, 2026 5:28PM

 

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణం జాయ్ అలుకాస్‌లో చోరీ జరుగుతున్నట్లుగా నిన్న యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేదించారు. పోలీసుల దర్యాప్తులో షాపులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను క్రమంగా అపహరించిన ఘటన  బయట పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఆదివారం 15వ తేదీన జై అలుకాస్ యజమాన్యం తన షాప్ లో బంగారు బిస్కెట్లు చోరీ జరిగినట్లుగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దొంగతనానికి పాల్పడిన ఉద్యోగి అసలు రంగు బయటపెట్టారు. పంజాగుట్ట సంబంధిత ఉద్యోగి జాయ్ అలుకాస్ షాపులో పనిచేస్తూ ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా అతి జాగ్రత్తగా రోజుకు కొద్దికొద్దిగా ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. షాపులో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరే కావడంతో అతనిపై తొలుత ఎలాంటి అనుమానం కలగలేదు. అయితే స్టాక్‌ తనిఖీల సమయంలో ఆభరణాలు మిస్సింగ్‌గా గుర్తించిన యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది.

సీసీటీవీ ఫుటేజ్‌లు, స్టాక్ రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు జాయ్ అలుకాస్ యాజమాన్యం నిర్ధారించింది. వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన సమాచారంతో  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి  1,65,00,000 రూపాయల విలువ చేసే 10 బంగారు బిస్కెట్లు, ఒక బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, షాపింగ్ మాల్స్ మరియు ఆభరణాల దుకాణాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పోలీసులు సూచించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...