ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు జోనాథన్ కన్నుమూత

posted on: Apr 2, 2026 10:43AM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ  తాబేలు జోనాథన్ కన్నుమూసింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అత్యంత వృద్ధ జంతువుగా గుర్తింపు పొందిన తాబేలు జోనాథన్ 193 సంవత్సరాలకుపైగా జీవించి చరిత్ర సృష్టించింది.  ఈ మహా వృద్ధ తాబేలు బుధవారం (ఏప్రిల్ 1)  మరణించి నట్లు సెయింట్ హెలెనా అధికారులు అధికారికంగా ప్రకటించారు. బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ అయిన సెయింట్ హెలెనాలో నివసించిన జోనాథన్ జీవితం నిజంగా అరుదైనది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ తాబేలు 1832లో జన్మించింది. అనంతరం 1882లో హిందూ మహాసముద్రం ప్రాంతం నుంచి సెయింట్ హెలెనాకు దీనిని తరలించారు.

 1930లలో అప్పటి గవర్నర్ సర్ స్పెన్సర్ డేవిస్ ఈ తాబేలకు  జోనాథన్  అని పేరు పెట్టారు. అప్పటి నుంచి గవర్నర్ అధికారిక నివాసమైన ప్లాంటేషన్ హౌస్ ప్రాంగణంలోనే జోనాథన్ నివసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. సుమారు రెండు శతాబ్దాలు జీవించిన ఈ తాబేలు  అనేక తరాల మార్పును చూసింది. బ్రిటిష్ సామ్రాజ్యం కాలం నుంచి ఆధునిక యుగం వరకు చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది.

సెయింట్ హెలెనా పశువైద్యుడు జో హాలిన్స్ జారీ చేసిన ప్రకటనలో జోనాథన్ మరణం  ప్రపంచానికే ఒక పెద్ద లోటని పేర్కొన్నారు. జోనాథన్ మృతి ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా కూడా 'ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువు గా జోనాథన్ అధికారిక గుర్తింపు పొందింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...