హైదరాబాద్ లో పోచంపల్లి వైభవం ఆవిష్కృతం!

posted on: May 29, 2026 1:30PM

హైదరాబాద్ నగరంలో పోచంపల్లి చేనేత వైభవం ఆవిష్కృతం కానుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా సంప్రదాయ వస్త్రాలు, హస్తక ళలు, స్థానిక వంటకాల ప్రత్యేకతలను నగర ప్రజ లకు పరిచయం చేస్తూ  థ్రెడ్. పోచంపల్లి  పేరుతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించ నున్నారు. జూన్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని  హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. గ్రామీణ నేత కార్మికులు, పట్టణ వినియోగదారుల మధ్య వారధిగా ఈ ప్రదర్శన నిలవనుంది. ఈ కార్యక్రమంలో 100కు పైగా స్టాల్స్‌లో పోచంపల్లి చేనేత చీరలు, చేతితో నేసిన వస్త్రాలు, సమకాలీన దుస్తులు, హస్తకళ ఉత్ప త్తులు నేరుగా నేత కార్మి కులు, తయారీదారుల నుంచే అందుబాటులో ఉంచనున్నారు.

కేవలం వస్త్ర ప్రదర్శనకే పరిమితం కాకుండా, సంప్రదాయ మగ్గాల ప్రత్యక్ష ప్రదర్శనలు, టై-అండ్-డై నేత ప్రక్రియల వివరణ, అలాగే యాదాద్రి- భువనగిరి జిల్లా ప్రత్యేక వంటకాల రుచులు సందర్శకులను ఆకట్టు కోనున్నాయి. ఈ కార్యక్ర మం ద్వారా పోచంపల్లి చేనేత కళాకారుల ప్రతిభను నగర ప్రజలకు చేరవేయ డంతో పాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం కల్పిం చాలన్నదే తమ ఉద్దేశంగా నిర్వాహకులు చెబుతున్నారు. 

అదే విధంగా, యాదాద్రి, వనగిరి జిల్లాను సుస్థిర పర్యాటక కేంద్రంగా అభి వృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రదర్శనను రూపొందిం చారు. హైదరాబాద్‌కు కేవలం రెండు గంటల దూరంలో ఉన్న పోచంపల్లిని వీకెండ్ పర్యాటక గమ్యస్థానంగా పరిచయం చేసే ప్రత్యేక అనుభవ సర్క్యూట్ల ను కూడా సందర్శకులకు వివరించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...