Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోడీ ద గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఇండియన్ ప్రొడక్ట్స్!?
posted on: May 25, 2026 12:29PM

ప్రస్తుత వాణిజ్య ప్రపంచంలో సినీ తారలు, క్రీడాకారులు తమ ఎండార్స్‌మెంట్ల కోసం కోట్లాది రూపాయల పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. కానీ, దేశ స్థానిక ఉత్పత్తులకు, సంప్రదాయ ఆహారాలకు అంతర్జాతీయ వేదికలపై ప్రచారం కల్పిస్తున్న అసాధారణ బ్రాండ్ అంబాసిడర్ మరొకరు ఉన్నారు. ఆయనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
ఇటీవలి ఇటలీ పర్యటనలో ప్రధాని మోడీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి అందించిన మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్, ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ రిలేషన్స్ పరంగా ఒక అద్భుతమైన చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు.. ఇండియన్ ప్రోడక్టల సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే ఒకానొక వ్యూహాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు మార్కెట్ ఎనలిస్టులు.
మెలోడీ మ్యాజిక్.. అనుకోని గ్లోబల్ మార్కెటింగ్ గా మారిందా? అంటే అవుననే తెలుస్తోంది. బాల్యం నుంచి భారతీయుల నాలుకపై నానుతున్న మెలోడీ చాక్లెట్‌ను పార్లే ప్రొడక్ట్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే సినీ తారలు చేయలేని ప్రచారాన్ని.. ప్రధాని మోడీ తన సహజసిద్ధమైన దౌత్య పద్ధతి ద్వారా ఉచితంగా చేసిపెట్టారు. పార్లే సీఎంవో మయాంక్ షా అన్నట్టుగా, ఇది భారతీయ చిన్నతరహా ఉత్పత్తులకు ప్రపంచ వేదికపై దక్కిన గుర్తింపు. మెలోడీని ఒక అంతర్జాతీయ రాయబారిగా నిలబెట్టడం ద్వారా.. భారతీయ బ్రాండ్లు ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మోడీ నిరూపించారు.
అయితే ప్రధాని మోడీ ఇదంతా ఎందుకు చేశారంటే.. కేవలం దౌత్యపరంగా చేశారు. కానీ అనుకోకుండా ఇక్కడే అవి స్థానిక పారిశ్రామికవేత్తల ఆత్మస్థైర్యాన్ని పెంచే ఆర్థిక ఉత్తేజకాలుగా మారాయి. ప్రధాని మోడీ వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా.. పిలుపు కేవలం నినాదాలకే పరిమితం కాలేదు. ఆయన నాయకత్వంలో ఖాదీ పరిశ్రమ నేడు రూ. 1.7 లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. మన్ కీ బాత్ లో ఆయన చేసిన అభ్యర్థనతో ఒక్క రోజులోనే ఖాదీ భవన్‌లో రూ. 1.52 కోట్ల రికార్డు అమ్మకాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్‌గ్రామ్‌లోని రోడ్డు పక్కన ఉన్న స్టాల్‌లో ఆయన జల్ మురి ని ఆస్వాదించడం, ఆ చిన్న స్నాక్ బ్రాండ్‌ను నేడు జాతీయస్థాయి ఆహార ఉత్పత్తిగా ఎదిగేలా చేసింది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులే కాకుండా.. భారతీయ ఆహారపు అలవాట్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పాల్సి ఉంటుంది.
2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించేలా ఐక్యరాజ్యసమితిని ప్రభావితం చేయడం ద్వారా, భారతదేశాన్ని గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్ గా మార్చారు. గిరిజన రైతు లహరి బాయి వంటి వారిని ప్రశంసించడం ద్వారా క్షేత్రస్థాయి రైతులను ప్రోత్సహిస్తున్నారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. రైతులను సంప్రదాయం నుంచి పుట్టిన ఆధునిక వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఇది దేశాన్ని సహజ వ్యవసాయానికి ప్రపంచ కేంద్రం గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాని మోడీ తనను తాను చిన్న రైతులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రాయబారి అని పిలుచుకోవడం వెనుక ఉన్న వాస్తవం.. వారి పట్ల ఆయనకున్న నిబద్ధత. ఒక ఉన్నత స్థాయి దౌత్య సమావేశంలో స్థానిక బ్రాండ్లను ప్రదర్శించడం అనేది, ఆ సంస్థలకు ఇచ్చే అతి పెద్ద గుర్తింపు. ఇది భారతదేశ చిన్న వ్యాపారాలకు ప్రపంచ మార్కెట్లో పోటీపడేలా చేసే ఒక బ్రాండింగ్ వ్యూహం. ప్రధాని మోడీ బహుమతులు ఇచ్చే విధానంలో ఒక గొప్ప ఎకనామిక్స్ క్లాస్ సైతం దాగి ఉందని అంటారు పులువురు ఆర్ధిక నిపుణులు. అది తన దేశపు ఉత్పత్తులపై ఆయనకున్న నమ్మకం. మెలోడీ, ఖాదీ, చిరుధాన్యాల ద్వారా ఆయన ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఒక్కటే.. భారతీయత ప్రపంచ స్థాయికి చేరుకోగలదు. మేక్ ఇన్ ఇండియా కేవలం ఒక నినాదం కాదు, అది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక అంటూ, ఆయన తన ప్రతి చర్యలోనూ మిళితం చేస్తున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.


.webp)
.webp)


