Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హిట్ మ్యాన్ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్.!?
posted on: Jul 17, 2026 9:30AM

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనదైన ముద్ర వేసిన స్టార్ ఓపెనర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిందా? ఇప్పటికే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే లకు కూడా దూరం కానున్నాడా.. అంటే బీసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఔననే అనాల్సి వస్తోంది. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్ కు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీసే చివరి సిరీసా అన్న చర్చ జోరుగా నడుస్తోంది.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన పట్ల అతడి అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ తో గురువారం (జులై 16) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ 47 బంతులు ఎదుర్కొని 26 పరుగులు మాత్రమే చేసి ఔటైన తీరుతో అతడి క్రికెట్ కెరీర్ ఫ్యూచర్ పై అందరిలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే మ్యాచ్ అతని కెరీర్ లో చివరి మ్యాచ్ కానుందన్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.
పీటీఐ వెల్లడించిన కథనం ప్రకారం, రోహిత్ స్థానంపై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెరీర్ విషయంలో ఇప్పటికే చర్చలు జరిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే జట్టులోకి యువతను తీసుకోవాలని యోచిస్తున్నారు. 39 ఏళ్ల రోహిత్ శర్మ స్థానంలో, ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. . 2027 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా దాదాపు 20 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌లలో జైస్వాల్‌కు ఓపెనర్‌గా పూర్తి స్థాయి అవకాశం కల్పిస్తేనే వరల్డ్ కప్ కు ప్లస్ అవుతుందన్నది సెలక్టర్లు, బీసీసీఐ యోచన చేస్తున్నట్లు పీటీఐ కథనం పేర్కొంది.
రోహిత్ కు సెప్టెంబర్ నెలలో విండీస్ తో జరిగే వన్డే సిరీస్ లో స్థానం అనుమానమేనని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు పరిశీలనలో లేదన్న విషయాన్ని ఇప్పటికే సెలక్టర్లు అతనికి తెలిపారని విశ్వసనీయ సమాచారం. మరో వైపు విరాట్ కోహ్లీ తన ఫామ్, అత్యుత్తమ ఫిట్‌నెస్ కారణంగా జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.
Rohit Sharma, ODI Retirement, India vs England ODI, Yashasvi Jaiswal


.webp)



