డీకేకు అప్పుడే మొదలైన అసమ్మతి సెగ

posted on: Jun 5, 2026 12:17PM

 కర్నాటక సీఎంగా  డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసి మంత్రిమండలి ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే ఆయన కేబినెట్ లో అసంతృప్తి రాజుకుంది.  ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కలేదన్న అసంతృప్తితో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి  శాఖ తనకు  కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.  

మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు అప్పగిస్తానని డీకే శివకుమార్ గతంలో ఇంటికి వచ్చి మరీ  హామీ ఇచ్చారనీ,  ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా ఆయన అదే మాట చెప్పారనీ రామలింగారెడ్డి అన్నారు.  ఇప్పుడు మాట తప్పారనీ చెప్పిన  అందుకే మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు.  తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...