తమిళనాడులో సంచలనం.. సీఎం స్టాలిన్ ఓటమి

posted on: May 4, 2026 4:02PM

 

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన, టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో అనూహ్యంగా ఓటమి చెందారు.

ఈ ఫలితం డీఎంకే పార్టీకి పెద్ద షాక్‌గా మారింది. సుదీర్ఘ కాలంగా స్టాలిన్‌కు బలమైన కంచెగా భావించిన కొళత్తూరులో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం చెపాక్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కుటుంబ స్థాయిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో తీవ్ర పోటీ నెలకొనగా, కొత్త పార్టీలు కూడా గట్టిగా ప్రభావం చూపినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా టీవీకే అభ్యర్థి విజయం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...