గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్

posted on: Feb 5, 2026 1:07PM

 

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియమాకలపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను న్యాయస్ధానం రద్దు చేసింది. గతంలో మెరిట్‌ లిస్ట్‌ను కాన్సిల్ చేసి మెయిన్స్ పేపర్స్ మళ్లీ మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి ఆర్డర్‌ను సీజే ధర్మాసనం రద్దు చేసింది.  గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. 

ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. 563 మంది గ్రూప్ - 1 అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్బవం తర్వాత తొలిసారి గ్రూప్-1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...