ఆత్మాహుతి దాడి కాదు.. బలిదాన ఆపరేషన్.. ఉమర్ నబీ సంచలన వీడియో

దేశాన్ని కుదిపేసిన డిల్లీ ఆత్మహుతి దాడి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఒక ఉగ్రవాది మొబైల్ ఫోన్ లో ఈ వీడియోను ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో ఉమర్ నబీ ఆత్మాహుతి దాడులను సమర్ధిస్తూ మాట్లాడారు. ఆత్మాహుతి దాడిని బలిదాన ఆపరేషన్ గా అభివర్ణించాడు.  ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. ఉమర్ తాను ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి కొన్ని నిముషాల ముందు ఈ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

 ఈ వీడియోలో ఉమర్ నబీ తీవ్రవాద సిద్ధాంతాలను వల్లెవేస్తూ యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపించేలా మాట్లాడారు. ఈ వీడియోతో పాటు ఇతర డేటాను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఉగ్రదాడి సూత్రధారులు, వారి నెట్ వర్క్ పేలుడు పదార్థాల సరఫరా మార్గాలు వంటి కీలక అంశాలను వెలికితీ యడానికి దర్యాప్తు మరింత వేగవంతం చేశామని  వెల్లడించారు. దేశమంతటా ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ ఈ వీడియో కీలకంగా మారుతుందని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu