Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ –విజయవాడ టెర్రర్ లింక్ కలకలం
posted on: Mar 24, 2026 10:19AM

విజయవాడ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వించిపేట ప్రాంతంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కాగా ఈ ముగ్గురికీ హైదరాబాద్ లోని టెర్రర్ నెట్ వర్క్ తో సంబంధాలున్నాయని తేలడం మరింత సంచలనం సృష్టిస్తోంది. ఉగ్ర కార్యకలాపా లకు అనుబంధంగా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమౌౌతున్నాయి. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతుగా వీడియోలు పోస్టు చేస్తున్న మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్ అను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
వీరు కొంతకాలంగా ఉగ్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు గుర్తించారు. దర్యాప్తులో ఈ ముగ్గురికీహైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెనే ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరారీలో ఉండగా.. ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇక విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లతో ఈ యువకులకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ మసీదులో వీరి పరిచయం ఏర్పడినట్లు దర్యాప్తులో తేలింది.
వివిధ ప్రాంతాల్లో యువతను ప్రభావితం చేసి, ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసిన కోణంలో కూడా అధికారులు విచారణను మరింత విస్తరించారు. ప్రస్తుతం అదుపులో ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి రాబట్టే సమాచారం ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.


.webp)



