Latest News

గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి ట్రంప్ యత్నాలు.. ప్రతిఘటిస్తామంటున్న డెన్మార్క్

posted on: Jan 20, 2026 8:28AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం మరో సారి బయటపడింది. గ్రీన్ ల్యాండ్ ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గ్రీన్ ల్యాండ్ దిశగా అమెరికా యుద్ధ విమానాలు మోహరించాయి.

ఈ నేపథ్యంలో డెన్మార్క్ అప్రమత్తమైంది. గ్రీన్ ల్యాండ్ లోని వ్యూహాత్మక స్థావరాల వద్ద డెన్మార్క్ సైనిక బలగాలను మోహరించింది.  అమెరికా చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనీ,  గ్రీన్‌లాండ్ డెన్మార్క్ లో భాగమనీ పేర్కొన్న డెన్మార్క్ రక్షణ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ ల్యాండ్ రక్షించుకుంటామని ప్రకటించింది.  అయితే ట్రంప్ మాత్రం గ్రీన్ ల్యాండ్  అమెరికా నియంత్రణలో ఉండాలని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.  

తాజాగా అమెరికా కేవలం విమానాలను పంపడమే కాకుండా, వచ్చే నెల నుంచి  10 శాతం దిగుమతి సుంకాలతో డెన్మార్క్‌పై ఆర్థికంగా ఒత్తిడి తీసుకువచ్చేలా వ్యూహాలు రూపొందిస్తున్నది. కాగా అమెరికా వైఖరికి నిరసనగా యూరోపియన్ యూనియన్   డెన్మార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నది.  దీంతో ఆర్కిటిక్ ప్రాంతంలో  రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...