రోడ్డు ప్రమాదంలో పది మంది మహిళలకు గాయాలు
posted on Nov 6, 2025 2:22PM
.webp)
నెల్లూరు జిల్లా ఉలవలపాడు సమీపంలో గురువారం (నవంబర్ 6) జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మహిళలు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా అలగాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వారే. వీరంతా లోకేష్ ప ర్యటన కోసం వచ్చి తిరిగి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
వీరు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిస్తామన్న భరోసా ఇచ్చారు.
ఇలా ఉండగా తన పర్యటనకు వచ్చి తిరగి వెడుతున్న మహిళలు ప్రమాదంలో గాయపడటం పట్ల మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.