బిజినెస్ స్పాట్‌లైట్ అవార్డ్స్ డిజిటల్ మీడియా భాగస్వామిగా తెలుగువన్

ఔట్‌లుక్ బిజినెస్‌తో కలిసి బిజినెస్ మింట్ ప్రదానం చేసే ‘ది ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్ రియాలిటీ అవార్డ్స్ 2025 , అలాగే ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్ ఎంటిటీ అవార్డ్స్ 2025 లకు డిజిటల్ మీడియా భాగస్వామిగా భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటైన  తెలుగువన్ చేరింది. ఈ విషయాన్ని తాజాగా ఇరు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.

2025 నవంబర్ 14న హైదరాబాద్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌లు జరగనున్నాయి. రియల్ ఎస్టేట్ అలాగే వ్యాపార రంగాలలో శ్రేష్ఠత, ఆవిష్కరణ, లీడర్ షిప్ లను సత్కరించే ఈ వేడుక, భారతదేశంలో మోస్ట్ అవైటింగ్  వేడుకలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

దేశ ఆర్థిక , సృజనాత్మక దృశ్యాన్ని రూపొందించడంలో అసాధారణమైన ఆవిష్కరణ,  లీడర్ షిప్ అలాగే  ప్రభావాన్ని చూపిన సంస్థలు, వ్యక్తుల అద్భుత  విజయాలను ఈ ‘ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్’ అవార్డులు సత్కరిస్తాయి.

ఈటీ నౌ బ్రాడ్‌కాస్ట్ పార్టనర్ గా,  ‘తెలుగువన్’ డిజిటల్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నందున, ఈ అవార్డుల వేడుకలు దేశవ్యాప్తంగా ఎక్కువమందికి చేరువవుతాయనడంలో సందేహం లేదు. వీటి ద్వారా భారతదేశంలోని అత్యంత దార్శనిక బ్రాండ్‌లు,   బిజినెస్ లీడర్ల  విజయ ప్రస్థానాలకు విస్తృత ప్రచారం జరగనుంది. 

రియాలిటీ అవార్డులు, ఎంటిటీ అవార్డులు రెండింటికీ 300+ సీఎక్స్ వోలు, వ్యవస్థాపకులు, డెవలపర్లు,  పరిశ్రమ మార్గదర్శకులు సహా 600 మందికి పైగా హాజరవుతారు. ఆ రోజు ప్యానెల్ చర్చలు, సెలబ్రిటీ ఎంగేజ్మెంట్లు, అలాగే ఔట్‌లుక్ బిజినెస్,  దాని డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రత్యేక సంపాదకీయ కవరేజ్ ఉంటాయి. ఇది కేవలం అవార్డుల వేడుక మాత్రమే కాదు, గొప్పగా ఆలోచించే భారతదేశపు అత్యంత సాహసవంతులైన వ్యక్తుల వేడుకగా భాసిల్లుతుంది.

ఈ భాగస్వామ్యం గురించి బిజినెస్ మింట్ వ్యవస్థాపకుడు వివినయ్ కాంత్ కొరపాటి మాట్లాడుతూ, ‘తెలుగువన్‌’తో ఈ అనుబంధం మా దార్శనికతను ప్రాంతీయ అలాగే  డిజిటల్ ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందన్నారు. ఔట్‌లుక్ బిజినెస్ మరియు ఈటీ నౌతో కలిసి  ఆవిష్కరణ,  విజయాల బహుళ-వేదిక వేడుకను సృష్టించాలన్నదే మా లక్ష్యం అని వినయకాంత్ కొరపాటి అన్నారు.

రాబోయే ఎడిషన్లు ప్రీమియం అనుభవాలు, జాతీయ స్థాయి ఎక్స్‌పోజర్,  డైనమిక్ నెట్‌వర్కింగ్ అవకాశాలకు ఇది వేదిక అవుతుందనడంలో సందేహం లేదు.  దేశంలో ఎంటర్‌పెన్యూర్,  రియల్ ఎస్టేట్ భవిష్యత్తును నిర్వచించే వారిని గౌరవించడంలో బిజినెస్ మింట్ మరియు అవుట్‌లుక్ బిజినెస్ నిబద్ధతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu