Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ పురపోరులో ఎగిరిన తెలుగుదేశం జెండా
posted on: Feb 13, 2026 10:37AM
.webp)
తెలంగాణలో జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం జెండా ఎగిరింది. నిజమే తెలంగాణ పురపోరులో ఖమ్మం జిల్లా మధిర మునిసిపాలిటీ పదో వార్డులో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు. మధిర పదో వార్డులో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన బోడేపూడి రేవతి విజయం సాధించారు.
ఆమెకు వార్డులో మొత్తం పోలైన 530 ఓట్లలో 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం అన్న సంగతి తెలిసిందే. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 చోట్ల విజయం సాధించారు. ఇక ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. అశ్వారావుపేట, పెద్దపల్లి, కామారెడ్డి, భీంగల్, మరిపెడ, చండూరు, చొప్పదండి, రామాయంపేట, బాన్సువాడ, హాలియాల మునిసిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.


.webp)
.webp)


