గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు పర్యాటకులు...సహాయం కోసం ఆర్తనాదం

posted on: Mar 3, 2026 2:17PM

 

మధ్యప్రాచ్య దేశం బెహరన్‌లో  తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు చిక్కుకుపోయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టూరిస్ట్ వీసాపై నాలుగు రోజులపాటు పర్యటించేందుకు వెళ్లిన వారు అనూహ్య పరిస్థితుల కారణంగా అక్కడే ఇరుక్కుపోయినట్లు సమాచారం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది.

పర్యాటకుల వాంగ్మూలాల ప్రకారం, తమ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చైపోయాయని, కనీసం మందులు కొనుగోలు చేసుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు పొందలేకపోతున్నామని చెబుతున్నారు. “ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నాం” అంటూ వారు భావోద్వేగంతో వెల్లడించారు. తమను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని దేశ ప్రధాని నరేందర్ మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను విజ్ఞప్తి చేశారు. 


రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం చేసి ప్రత్యేక విమాన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
అదేవిధంగా Embassy of India, Manama నుంచి తగిన సహాయం అందడం లేదని పర్యాటకులు ఆరోపి స్తున్నారు. తమ సమస్య లను వివరించినప్పటికీ స్పష్టమైన హామీ లభించ లేదని తెలిపారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బాధితులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు చేపట్టా లని వారి కుటుంబసభ్యులు కూడా కోరుతున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...