Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
posted on: Feb 17, 2026 11:12AM
.webp)
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే సీఆర్ పుట్టినరోజు నేడు సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు, రాజకీయ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నినిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా ఉండగా కేటీఆర్ తన తండ్రికి జన్మదిన శేభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఎమోషనల్ పోస్టు చేశారు. తన తండ్రి కేసీఆర్ తన ఒక్కడికే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ హీరో అని పేర్కొన్నారు. కాగా కేసీఆర్ జన్మదినం సందర్భంగా నందినగర్ లోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అంతకుముందు ‘హ్యాపీ బర్త్ డే డాడీ’ అంటూ … కెసిఆర్ పాదాలకు నమస్కారం చేస్తున్న ఫొటోను కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేశారు.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ తదితరులు కూడా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



.webp)


