వందల కోట్లతో ప్రైవేట్‌ జెట్‌... మాల్యాను తలపిస్తోన్న మెగా కాంట్రాక్టర్‌

ఈయనో మెగా కాంట్రాక్టర్‌... తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద కాంట్రాక్ట్‌ అయినా ఈయనిదే... ఈ మెగా కాంట్రాక్టర్‌కి అధికార పార్టీలకే కాదు... విపక్షాలకు కూడా ఈయన బాగా కావాల్సినవాడు... ప్రభుత్వ పెద్దలతో, బడా నేతలతో అయితే ఇంకా క్లోజ్‌గా ఉంటాడు... అంతేకాదు ఏం మాయ చేస్తాడో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎలాంటి బిగ్‌ కాంట్రాక్ట్‌ అయినా ఈయనిదే...అయితే ఇప్పుడు ఈ మెగా కాంట్రాక్టర్‌ సరికొత్త ఎత్తు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాధినేతలను, మంత్రులను, పలుకుబడిగల ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకునేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రైవేట్‌ జెట్‌ కొనుగోలు చేశాడు. అంతేకాదు ఆ ప్రైవేట్‌ జెట్‌లో మరో 75కోట్లతో స్వర్గాన్ని తలపించేలా ఇంటీరియల్‌ డెకరేషన్‌ చేయిస్తున్నాడట.

 

సకల సౌకర్యాలు, సుఖభోగాలకు నిలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ జెట్‌ను పొలిటికల్‌ లీడర్లకు సప్లై ఇవ్వబోతున్నాడట. ఇలాంటి ప్రైవెట్‌ జెట్‌ ఇంతకుముందు ఒక్క విజమ్‌మాల్యాకే ఉండేదని, విహార యాత్రలకు విలాసాలకు అమ్మాయిలతో కలిసి తిరుగుతూ జల్సాలు చేయడానికి దాన్ని ఉపయోగించేవాడని, ఇప్పుడు అలాంటి జెట్‌‌నే ఈ మెగా కాంట్రాక్టర్‌ ప్రత్యేకంగా తయారు చేయించడంతో.... ఈయన కూడా అలాంటి పనులకే దీన్ని ఉపయోగిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.అయితే దేశంలోని పెద్దపెద్ద ఇన్‌ఫ్రా కంపెనీలు సైతం తమ సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేక కొట్టుమిట్టాడుతుంటే, ఈ మెగా వీరుడు మాత్రం వందల కోట్ల ఖర్చుతో ప్రైవేట్‌ జెట్‌ను సమకూర్చుకోవడం అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు ఇన్‌ఫ్రా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

ఒకవైపు మెజారిటీ ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ ఏడాదిగా జీతాలు కూడా ఇవ్వలేక, బ్యాంకుల అప్పులు కట్టలేక రుణాలను రీషెడ్యూల్‌ చేసుకుంటుంటే, ఈ మెగా కాంట్రాక్టర్ మాత్రం ఏవిధంగా వందల కోట్లతో ప్రైవెట్‌ జెట్ కొనగలుగుతున్నారో, ఆ జిమ్మిక్కు ఏమిటో తెలియడం లేదంటున్నారు. ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ నష్టాల్లో నడుస్తుంటే, ఈ మెగా కాంట్రాక్టర్‌ ఒక్కడు మాత్రమే ఇలా దూసుకుపోవడం ఎలా సాధ్యమంటున్నారు?. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ ఈయనకే దక్కడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మెగా కాంట్రాక్టర్‌.... రెండు తెలుగు రాష్ట్రాలకు ముద్దుబిడ్డగా మారాడని, పైగా ఇప్పుడు ఇంద్రభవనంలాంటి ప్రైవేట్‌ జెట్‌‌తో ప్రభుత్వ పెద్దలను బుట్టలో వేసుకోవడం ఖాయమంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu