ఈ వార్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?

posted on: Mar 4, 2026 7:12PM

 

తెలుగువన్ ‘వాస్తవ వేదిక’లో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పాల్గొని  ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై విశ్లేషణాత్మకంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుందని పీవీ రమేష్ పేర్కొన్నారు. 

చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే ప్రచారం జరుగుతోందని,  రవిశంకర్ ప్రశ్నించారు. అలాగే సౌదీ అరేబియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న మార్పులను పీవీ రమేష్ విశ్లేషించారు. మధ్యప్రాచ్య రాజకీయాల్లో శక్తిసామ్యాలు ఎలా మారుతున్నాయో వివరించారు.

యుద్ధాల్లో మతపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని, దీని ప్రభావం ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని పీవీ రమేష్ తెలిపారు. “ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?” అనే ప్రశ్నను రవిశంకర్ సంధించగా, ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఎవరిదన్న అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి అనేక కీలక, ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్,  పీవీ రమేష్ మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో రేపు సాయంత్రం 7 గంటలకు తప్పక వీక్షించండి.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...