చక్రి మృతి అనుమానాస్పదం
posted on: Jan 10, 2015 10:32AM

తనను చక్రి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి జూబిలీ హిల్స్ పోలీసులను ఆశ్రయించి వారిపై గృహహింస కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చక్రి భార్య శ్రావణి చక్రి మరణం మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. చక్రి చనిపోయిన రోజు ఆయన తన అత్తగారి ఇంట్లో భోజనం చేశారని ఆమె చెబుతున్నారు. అంటే చక్రికి ఆయన తల్లి, ఇతరులు విషం పెట్టారన్నది ఆమె అనుమానం కావొచ్చు. అలాగే చక్రి చనిపోగానే ఇంట్లో వున్న విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు వాళ్ళు తీసేసుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. చక్రి చనిపోయిన వెంటనే వాళ్ళు తనను వేధించడం ప్రారంభించారని ఆమె అంటున్నారు. తమ కుటుంబ వ్యవహారం పరిష్కారం కోసం దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని, అయితే చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సమస్య పరిష్కారానికి సహకరించడం లేదని శ్రావణి ఆరోపిస్తున్నారు.






