Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆన్‌లైన్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు
posted on: May 15, 2026 8:26PM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కమిటీ సభ్యులంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.
మహానాడును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన చంద్రబాబు, ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ పండుగగా భావించే మహానాడు కార్యక్రమం జరగనుంది.






