Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వంశీ, బోడె ప్రసాద్‌లకు చంద్రబాబు క్లాస్...?
posted on: Sep 16, 2016 3:29PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకోవటంపై ఆ పార్టీలో ఎలాంటి వ్యతిరేకత రాలేదని పైకి చెబుతున్నా..కానీ అంతర్లీనంగా ఉన్న అసమ్మతి సెగ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. కృష్ణాజిల్లాలో అది తెలుగుదేశంలో నెహ్రూ రాకను వ్యతిరేకించేవారున్నారా.? ఎవరబ్బా..? వారు ఎవరో కాదు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌లు నెహ్రూ పచ్చ కండువా కప్పుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దేవినేని పార్టీలోకి వచ్చే వరకు నోరు మెదపని వీరిద్దరూ, ఆయన పార్టీలో చేరిన మరుక్షణమే తమ అసమ్మతిని వెళ్లగక్కారు. ఈ మేరకు వారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసినట్టు సమాచారం.
ఈ భేటీలో అయిన వీరు నెహ్రూ పార్టీలోకి రావడం వల్ల తమకు కలిగే ఇబ్బందులను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు కాస్త ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది..పార్టీలోకి కొత్తగా చేరేవారితో ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎవరిపనులు వారు చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎవరి నియోజకవర్గాల్లో వారు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని గట్టిగా క్లాస్ పీకి పంపారట. అధినేత వద్ద ఇలాంటి సమాధానాన్ని ఊహించని వారు కాస్త మనస్తాపానికి గురైయ్యారట.






