తెలంగాణ తెలుగుదేశంలో ఆధిపత్య పోరు
posted on Sep 11, 2015 12:31PM

తెలంగాణ టీడీపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. టీటీడీపీకి కొత్త సారధిని అపాయింట్ చేసేందుకు చంద్రబాబు సిద్ధమవడంతో... కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎర్రబెల్లి...ఈసారి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తుండగా, రేవంత్ రెడ్డి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ మరోసారి అవకాశమివ్వాలని కోరుతున్నా, దక్కే ఛాన్స్ లేకపోవడం..ఎర్రబెల్లి, రేవంత్ లు...మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది, అయితే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలై కష్టాలుపడ్డ రేవంత్ రెడ్డిపై చంద్రబాబుకు సానుభూతి ఉందని, పైగా కేసీఆర్, టీఆర్ఎస్ ను ధీటుగా ఢీకొట్టాలంటే అతనే కరెక్టనే భావనలో ఉన్నారట, కానీ సీనియర్ లీడర్ ఎర్రబెల్లిని కాదని, రేవంత్ కి పగ్గాలు అప్పగిస్తే అసలుకే మోసం వస్తుందని సందిగ్ధంలో పడ్డారంటున్నారు, దాంతో ఈ ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనే నిర్ణయానికి వచ్చారని, ఎర్రబెల్లికి సారధ్య బాధ్యతలు అప్పగిస్తే, రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఒకవేళ రేవంత్ కే పగ్గాలివ్వాల్సి వస్తే, ఎర్రబెల్లికి మళ్లీ పాత పోస్టే ఇచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా పొసగదని, ఆధిపత్య పోరుతో పార్టీ కేడర్ నలిగిపోవడం ఖాయమంటున్నారు మిగతా నేతలు.