ఇకనైనా చదవండి



తెలంగాణ రాష్ట్రం సిద్ధించేసింది. త్వరలో బంగారు తెలంగాణ కూడా వచ్చేస్తుంది. వచ్చే నాలుగేళ్ళ లోపు బంగారు తెలంగాణను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రశంసనీయమైన కృషిని చూస్తునే వున్నాం. బంగారు తెలంగాణను సాధించే అంశాన్ని రాజకీయ నాయకులకు వదిలేసి ఇక తెలంగాణ విద్యార్థులు చదువు మీద దృష్టి పెడితే మంచింది. తెలంగాణ రాష్ట్రం ఏ విషయంలోనూ ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా వెనుకబడి వుండకూడదు. ముఖ్యంగా చదువు విషయంలో. అన్నిటికీ చదువే మూలం. చదువులో వెనకబడితే అన్నిట్లోనూ వెనకబడి పోవడం ఖాయం. మొన్నీమధ్య విడుదలైన ఇంటర్మీడియల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పొరుగు రాష్ట్రం కన్నా మన రాష్ట్రం వెనుకబడి వుంది. ఇక వచ్చే ఏడాది ఆ పరిస్థితి వుండకూడదు. అందువల్ల తెలంగాణ విద్యార్థి లోకం ఇక చదువు మీద దృష్టి పెట్టాలి. చదువు విషయం ఇంత గట్టిగా చెప్పడానికి గల ముఖ్య కారణం మరొకటి వుంది.

మొన్నీమధ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజీవ్ విద్యా మిషన్ (రీమ్యాప్), తెలంగాణ నైపుణ్య సంస్థ (స్కి్ల్ మిషన్) తెలంగాణలోని పలువురు విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. తెలంగాణ విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలను చూసి ఆ రెండు సంస్థల ప్రతినిధులు నోళ్ళు తెరిచారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చదువుతున్న చదువు చాలదన్న విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అందువల్ల, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడున్న విద్యా ప్రమాణాలతో మన తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయి కాంపిటీషన్‌కి ఎదుర్కోగలరా? ఇప్పుడున్న పద్ధతే కొనసాగితే జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాలు మన చేజారిపోయే ప్రమాదం వుంది. అందువల్ల తెలంగాణ విద్యార్థిలోకం ఉద్యమాల బాటను విడిచిపెట్టి చదువుల బాట పట్టాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu