Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దానం నాగేందర్‌కు తెలంగాణ స్పీకర్ నోటీసులు
posted on: Jan 28, 2026 1:11PM
.webp)
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‍కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం (జనవరి 28) నోటీసులు ఇచ్చారు. దానం నాగేందర్ తో పాటు దానంపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిరువురినీ ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని వారికి వేర్వేరుగా ఇచ్చిన నోటీసుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు అందగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్యేలే అని ఆయన పేర్కొన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ ల విషయంలో స్పీకర్ ఇప్ప టి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ దానం నాగేందర్ కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.


.webp)
.webp)


