Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు
posted on: Apr 25, 2026 8:56AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ముగిసింది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనల ఎట్టకేలకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ఫల్రదమవ్వడంతో ముగిసింది. సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం (ఏప్రిల్ 24) అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం (ఏప్రిల్ 25) ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
అంతకు ముందు శుక్రవారం (ఏప్రిల్ 24) రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో జేఏసీ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా వేతన సవరణ), ఫిట్‌మెంట్, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ క్రమంలో కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ను తక్షణమే మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
మిగిలిన కీలక డిమాండ్లలో ఒకటైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఉన్నతాధికారులు, జేఏసీ సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ లభించడంతో జేఏసీ నాయకులు సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నారు.
గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. సమ్మె ముగియడంతో బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రవాణా సౌకర్యం తిరిగి సాధారణ స్థితికి రావడంతో బస్టాండ్లు మళ్లీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో ఒక భాగమని, కార్మికుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమౌతోంది.






