Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోలీస్ కొలువుల నోటిఫికేషన్ విడుదల
posted on: Jul 5, 2026 10:40AM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ శాఖ, జైళ్లు & దిద్దుబాటు సేవల శాఖ, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్)లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంబంధిత శాఖల నుంచి స్థానిక కేడర్ల వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు తదితర సమాచారం అందిన వెంటనే కొద్ది రోజుల్లో అధికారిక నోటిఫి కేషన్లు విడుదల చేయను న్నట్లు వెల్లడించారు.
పోలీస్ శాఖలో మొత్తం 5,000 వేలకుపైగా పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 148 సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, 14 ఏఆర్ రిజర్వ్ ఎస్‌ఐలు, 12 టీజీఎస్పీ రిజర్వ్ ఎస్‌ఐలు, 3 ఎస్‌ఏఆర్‌సీపీఎల్ రిజర్వ్ ఎస్‌ఐలు, 23 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎఫ్‌పీబీ) పోస్టులు ఉన్నాయి. అలాగే 3,697 సివిల్ కానిస్టేబుళ్లు, 1,052 ఏఆర్ కానిస్టేబుళ్లు, 24 ఎస్‌ఏఆర్‌సీపీఎల్ కానిస్టేబుళ్లు, 20 డ్రైవర్ కానిస్టేబుళ్లు, 7 మెకానిక్ కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక విభాగంలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 751 ఫైర్ ఫైటర్ల పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ కానుంది. జైళ్లు & దిద్దుబాటు సేవల శాఖలో 14 పురుష డిప్యూటీ జైలర్లు, ఒక మహిళా డిప్యూటీ జైలర్, 196 పురుష వార్డర్లు, 12 మహిళా వార్డర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్)లో 44 సబ్ ఇన్‌స్పెక్టర్లు, 1,380 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 7,437 పోస్టులకు నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. పోస్టుల వారీ అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్ తదితర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి.దీంతో చాలా కాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.



.webp)


