తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం..!

posted on: Jul 2, 2026 6:55PM

 

తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు మాజీ డీజీపీలు, కీలక పోస్టుల్లో ఉన్న పలువురు సీనియర్ పోలీసు అధికారులకు అందుబాటులో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపసంహరించుకోవాలని పోలీస్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 20 మంది మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారుల భద్రతా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ డీజీపీలైన స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మతో పాటు పలువురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సహా మరికొందరికి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. 

మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమ యంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రత లోనూ కోత విధించారు. గతంలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది గన్‌ మెన్‌లను కేటాయించిన చోట ఇప్పుడు ఎక్కువ మందికి 'వన్ ప్లస్ వన్' భద్రతకే పరిమితం చేసినట్లు సమాచారం. పోలీస్ శాఖ చేపట్టిన ఈ నిర్ణయం అధికార వర్గాల్లో తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. భద్రతా ముప్పు స్థాయిని పునఃసమీక్షించిన అనంతరం, అవసరానికి అనుగుణంగా మాత్రమే భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొన సాగించాలని ప్రభుత్వం, పోలీస్ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో భద్రతా వనరుల వినియోగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...