మద్యం ఆదాయంలో తెలంగాణ కొత్త రికార్డు!

posted on: Apr 27, 2026 12:25PM

తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఎక్సైజ్ శాఖకు మొత్తం రూ.44,557 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో ప్రధాన భాగం మద్యం అమ్మకాల ద్వారానే వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు   7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.  2018-19 అర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.20,859 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఏడు సంవత్సరాల్లో 2025‘26 నాటికి రూ. 40.209 కోట్లకు చేరుకుంది.  2024-25 అర్ధిక సంవత్సరంలో రూ.37,487 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాగా ప్రస్తుత సంవత్సరంలో  రూ.2722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగాయి.  రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి ఆదాయం రావడం ఇదే మొదటిసారి. మొత్తం 382.91 లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీరు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు 2 శాతం పెరిగినప్పటికీ, బీరు అమ్మకాలు 9 శాతం తగ్గాయి. అయినప్పటికీ మొత్తం ఆదాయం పెరగడం విశేషం. 
2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,859 కోట్లుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం, కేవలం ఏడు సంవత్సరాల్లోనే రెట్టింపుకు పైగా పెరిగి రూ.40 వేల కోట్ల మార్క్‌ను దాటింది. 

మద్యం విక్రయాలతో పాటు లైసెన్స్ ఫీజులు కూడా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం అందించాయి. 2620 మద్యం దుకాణాల రెంటల్ ఫీజుల ద్వారా రూ.1771 కోట్లు, 1214 బార్ల ద్వారా రూ.549 కోట్లు ఆదాయం లభించింది. మొత్తం 95,628 దరఖాస్తుల ఫీజుల ద్వారా రూ.2869 కోట్లు లభించింది.  

తెలంగాణ ఆవిర్బావం నుంచీ కూడా ఏటా  ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూ వస్తోంది.2 015–16లో రూ.12,706 కోట్లు ఉన్న ఆదాయం, 2016–17లో రూ.14,184 కోట్లు, 2017–18లో రూ.17,597 కోట్లు, 2018–19లో రూ.20,859 కోట్లు, 2019–20లో రూ.22,605 కోట్లు, 2020–21లో రూ.27,286 కోట్లు, 2021–22లో రూ.30,783 కోట్లు, 2022–23లో రూ.35,145 కోట్లు, 2023–24లో రూ.37,675 కోట్లు, 2024–25లో రూ.37,488 కోట్లు వచ్చింది. ఇప్పుడు 2025–26లో ఈ ఆదాయం రూ.40,209 కోట్లకు చేరి   చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...