మున్సిపల్ ఎన్నికల్లో 73.03 శాతం పోలింగ్
posted on: Feb 11, 2026 8:52PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 73.01 నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కార్పొరేషన్లలో 66.05% శాతం మున్సిపాలిటీల్లో 75.88% శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నాది. సాయంత్ర ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. క్యూలో నిల్చున్న వారికి 7 గంటల వరకూ అవకాశం ఇచ్చారు. మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం, ఈ నెల 16న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.



.webp)


