అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి : సీఎం రేవంత్‌

posted on: Feb 2, 2026 3:50PM

 

మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పీఏసీ జూమ్ మీటింగ్‍లో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని అభ్యర్ధుల గెలుపు బాధ్యతను తీసుకోవాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు లోకల్ మేనిఫెస్టోనూ సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నారు. 

బీసీలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తెలిపారు.  అభ్యర్థులకు బి-ఫామ్‍లు అందజేసే బాధ్యత డీసీసీ అధ్యక్షులు తీసుకోవాలని సీఎం తెలిపారు.  పార్టీ గుర్తులపై ఈ ఎన్నిలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క నాయకుడు  ఛాలెంజ్‌గా తీసుకోని గెలుపు కృషి చేయాలని సూచించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...