Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇదెక్కడి "జెండా" రా బాబు..
posted on: Jun 23, 2016 12:20PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ నెల 2వ తేదీ నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం భారీగానే ఖర్చు పెట్టింది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాస్త భిన్నంగా ఆలోచించి.. అతిపెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి విభిన్నంగా ఆలోచించడంలో తన మార్కును మరోసారి చూపించారు. దాదాపు 291 అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అయితే ఆవేశంగా జెండా పెట్టడానికైతే పెట్టారు కానీ.. దాని తరువాత వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించి ఉండరు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎగరేసిన జాతీయ జెండా.. ఆతరువాత రెండు రోజులకే చిరిగిపోయి షాకిచ్చింది. పోతే పోయింది కదా అని మరో జెండాను ఏర్పాటు చేశారు. అది కూడా మూడు రోజులకే చిరిగిపోయింది. మళ్లీ మరో జెండాను ఏర్పాటు చేయడం అది కూడా పోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకొని కూర్చున్నారు.
మొదట ఏర్పాటు చేసిన జెండాలు ఖమ్మం నుండి తెప్పించినవి కాగా.. ఈసారి మాత్రం ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కంపెనీ నుండి మూడు జెండాలు తెప్పించారు. ఈ సందర్బంగా తెలంగాణ అధికారులు వేగంగా వీస్తున్న గాలులకు జెండాలు పదే పదే చినిగిపోతున్నాయని..దానికి నియమ నిబంధనల గురించి కంపెనీని అడిగి తెలుసుకుంది. దీనికి ఢిల్లీలోని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కేవి గిల్ స్పందించి.. గాలులకు జెండాలు చిరగడం మాన్యమెంట్ ఫ్లాగ్ కేటగిరి కిందకు వస్తుందని, జెండా తొలగించినా కొన్ని రోజులు ఇబ్బంది ఉండదనే విషయం చెప్పి వివరించారు. దీంతో పోల్ ను రెండు రోజులు ఖాళీగా ఉంచిన అధికారులు.. నాలుగో జెండాను ఎగరవేశారు.
అయితే ఈ జెండాల ఖరీదు వింటే కూడా షాకవ్వాల్సిందే. ఒక్కో జెండా ఖరీదు దాదాపు 2 లక్షల వరకూ ఉంది. ప్రస్తుతానికి మూడు జెండాలు తెప్పించారు.. అంటే సుమారు ఆరు లక్షల వరకూ అన్నమాట. మరి ఇప్పుడు నాలుగో జెండా ఎగరేశారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఒకవేళ ఇది కూడా రెండు మూడు రోజులకే చిరిగిపోతే.. నెలకు ఓ పదికి పైన జెండాలు అవసరమవుతాయి. అప్పుడు దాని ఖర్చు.. ఎంత లేదనుకున్నా 20 లక్షల పైన అవుతుంది. మొత్తానికి ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న సామెత ప్రకారం.. జెండా పెట్టగానే పని అయిపోయిందని అనుకొని ఉంటారు పెద్దలు. దేశంలోనే పెద్ద జెండా పెట్టామని సంకలు గుద్దుకునే అధికారులకు.. ఈ జెండా పెద్ద టార్చర్ అయిపోయింది. ఈ నాలుగో జెండా ఎన్ని రోజులు ఉంటుందో.. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఇప్పుడు అనుకుంటున్నారు.


.jpg)



